వారం తిరిగే సరికి ఒక్క పోస్టర్ కూడా నెల్లూరు సిటీలో ఉండకూడదని అధికారుల్ని ఆదేశించి, 2014 – 2019లో పోస్టర్ ఫ్రీ సిటీ చేయడంలో భాగంగా రాష్ట్రంలోని అన్నీ మున్సిపాలిటీలకు ఆదేశాలు ఇచ్చారని, అందులో 90 శాతం సక్సెస్ అయ్యామని గుర్తు చేశారు.ప్రకటనలన్నీ సోషల్ మీడియాలో ఇచ్చుకోవాలని, గోడలపై అంటించకూడదని,తనదైన శైలిలో హెచ్చరించారు.సిటీ అందంగా ఉండాలంటే పోస్టర్లు ఉండకూడదని, ముఖ్యంగా ఆయన ఫ్లెక్సీలు ఎక్కడున్నా ఫస్ట్ తీసేయమని ఆదేశించారు. రాజకీయ నాయకులు ఫ్లెక్సీలు పెట్టుకుంటే 48 గంటల్లోనే తీసేయాలని, ఫ్లెక్సీలు ఎవరూ కట్టవద్దని నెల్లూరు నగర ప్రజలందరికి విజ్ఞప్తి చేశారు.