నెల్లూరు నగరంలోని ఎసి నగర్లో జరిగిన రెవిన్యూ సదస్సులో మంత్రి నారాయణ గారు పాల్గొని, గత వైసిపీ ప్రభుత్వంలో ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ కబ్జాలకు పాల్పడ్డారని, సెంటు భూమి నుండి ఎకరాల్లో వైసిపీ ప్రభుత్వంలో కబ్జా జరిగిందని పేర్కొన్నారు.
ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా ప్రజల ఆస్తిని కాపాడేందుకే ల్యాండ్ గ్రాబింగ్ ప్రైవేన్షియల్ బిల్ ప్రవేశపెట్టామని, ప్రవైట్ వ్యక్తి ఆస్థి లాక్కున్నా, ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన నాన్ బెయిల్ క్రింద 10 నుండి 14 సంవత్సరాల జైలు శిక్ష తప్పదన్నారు.
త్వరితగతిన ప్రజా భూ సమస్యలు పరిష్కరించాలని,లేని యెడల సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోయామో ప్రజలకు అధికారులు వివరించాలని ఆదేశించారు. ఆయన కూడా ఎప్పటికప్పుడు అధికారులను ప్రజా భూ సమస్యల పరిష్కార వివరాలు తెలుసుకుంటూ ఉంటానని తెలిపారు.