ఏపీ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టి విశేష కృషి చేసారు . రాత్రి సమయంలోనూ ఆయన వరద సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఖండ్రిక సమీపంలో నున్న – నూజివీడు రహదారి చుట్టుపక్కల వరద నీటిని తొలగించేందుకు ఉన్న అన్ని మార్గాలపై అధికారులతో చర్చలు జరిపారు. మరోవైపు వరద బాధితుల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది,వరద బాధితులకు నిత్యావసరాల సరుకులను ,లక్షల కొద్దీ ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు. పారిశుద్ధ్య పనులు జరుగుతున్న తీరును పరిశీలించి శానిటేషన్‌లో భాగంగా డ్రైనేజీపై బ్లీచింగ్ చల్లారు. మరోవైపు డ్రైనేజ్ పనులపై కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి,నీరు నిల్వ ఉన్నప్పటికీ చెత్తను తొలగించకుంటే అంటు వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున నీటిలో ఉన్న చెత్తను తొలగిస్తూ వైద్యారోగ్య శాఖతో కలిసి హెల్త్ క్యాంప్‌లను నారాయణ గారు నిర్వహించారు.