కాకినాడ జిల్లా ఇన్చార్జిగా మంత్రి నారాయణ గారి మొదటి పర్యటన

జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మంత్రి నారాయణ తొలిసారిగా కాకినాడలో నవంబర్ 5న పర్యటించి టీడీపీ జిల్లా కార్యాలయానికి రాగానే కూటమి పార్టీల నాయకులు ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు చిన రాజప్ప,ఎమ్మెల్యేలు పంతం నానాజీ,వరుపుల సత్య ప్రభ,మాజీ శాసన సభ్యులు SVSN వర్మ, ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్,పార్టీ ఇన్చార్జి లు,ముఖ్య నేతలు పాల్గోన్నారు. తరువాత అయన టీడీపీ, జనసేన,బీజేపీ ముఖ్య నేతలతో సమావేశమైయారు. జిల్లాలో పార్టీల పరిస్థితి,కూటమి పార్టీ నేతల మధ్య సమన్వయం,ఎమ్మెల్సీ ఎన్నికలు పై సమావేశంలో చర్చించారు, ప్రతీనెలా మూడు సార్లు కాకినాడలో పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున, మంత్రి తన పర్యటనను పార్టీ సంబంధిత కార్యక్రమాలకే పరిమితం చేసి అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు.

Leave a Reply

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి