మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన జీవనోపాధుల జాతర వర్క్ షాప్ కార్యక్రమంలో మంత్రి నారాయణ గారు పాల్గొని, ఏ పని మీదైనా ఏకాగ్రతతో వంద శాతం దృష్టి పెడితే కచ్చితంగా సాదించవచ్చని, చేసే పనిలో డైవర్షన్ లేకుండా చేస్తేనే క్వాలిటీ వస్తుందని, సభ్యులను ఉద్దేశించి కార్యక్రమంలో సూచనలు చేసారు.రాష్ట్రంలో ప్రతీ ఒక్కరి తలసరి ఆదాయం రెట్టింపు అయ్యి, ప్రతీ కుటుంబంలో ఒక వ్యాపారవేత్త తయారు చేసి లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారని, దానికి అనుగుణంగా ప్రభుత్వం పధకాలు రచించడంలో ప్రొఫైలింగ్ యాప్ డేటా ఎంతో ఉపయోగపడుతుందని ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ గారు తెలిపారు.