రాజధాని నిర్మాణానికి భూములిచ్చేందుకు ముందుకొచ్చిన రైతుల ఇంటికి స్వయంగా మంత్రి నారాయణ గారు వెళ్లి స్వీకరించారు. ఎర్రబాలెంలో 11 మంది రైతుల నుంచి 12.27 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా స్వీకరించి,ఎవరైనా భూములు ఇవ్వాలనుకుంటే వారి ఇళ్లకే వెళ్లి తీసుకుంటామన్నారు. గతంలో రాజధానికి భూములు ఇవ్వని రైతులు నేడు స్వచ్ఛందంగా భూములు ఇవ్వడానికి సిద్ధపడ్డారని అన్నారు.రైతుల అనుమానాలు నివృత్తి చేసేందుకు సెంటు భూమి ఇచ్చిన వారి ఇంటికి కూడా నేరుగా వెళ్లి తీసుకుంటామని, భూములివ్వడానికి ముందుకు వచ్చిన రైతులకు అందుబాటులో ఉన్న భూముల్లో సొంత గ్రామాల్లో కోరుకున్న చోట రిటర్నబుల్ ప్లాట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు.