మంత్రి నారాయణ గారి దిశానిర్దేశంలో రాజధాని అభివృద్ధికి ₹11,000 కోట్ల విడుదలకు హడ్కో ఆమోదం

ముంబైలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో అమరావతి రాజధాని నిర్మాణానికి ₹11,000 కోట్ల రుణాన్ని మంజూరు చేయడానికి హడ్కో ఆమోదం తెలిపిందని మంత్రి నారాయణ గారు ప్రకటించారు.  ఈ సందర్భంగా నారాయణ గారు మాట్లాడుతూ, రాజధాని అభివృద్ధిని వేగవంతం చేయడానికి హడ్కోతో మంతనాలు నిర్వహించామని, ఈ నిధుల విడుదలతో నిర్మాణ పనులు మరింత ముందుకు సాగనున్నాయని వివరించారు.  

హడ్కో నిర్ణయం అమరావతి నిర్మాణంలో కీలక మలుపుగా మారుతుందని నారాయణ గారు తెలిపారు. ఈ ఆర్థిక మద్దతుతో రాజధాని నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తవుతాయని నారాయణ గారు అభిప్రాయపడ్డారు.ఈ నిధులతో అమరావతిని అత్యాధునిక రాజధానిగా తీర్చిదిద్దేందుకు అవసరమైన పనులు శీఘ్రంగా కొనసాగనున్నాయి. హడ్కో మద్దతుతో ప్రాజెక్ట్ మరింత బలంగా ముందుకు సాగుతుందని మంత్రి నారాయణ తెలిపారు.7

Leave a Reply

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి