విశాఖపట్నంలో గుంతలు పూడ్చే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారాయణ గారు
మంత్రి నారాయణ గారు విశాఖపట్నంలో గుంతలు పూడ్చే కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన 100 రోజుల ప్రణాళికలో భాగం. ఈ ప్రణాళికలో అన్ని రహదారులను గుంతల రహితంగా మార్చి, ప్రయాణికులకు రోడ్డుపై భద్రతను మరియు సౌకర్యాన్ని కల్పించడమే లక్ష్యం. గుర్తించిన 4,441 గుంతల్లో 2,009 గుంతలు, ₹6.83 కోట్ల వ్యయంతో ఇప్పటికే పూడ్చివేయబడ్డాయి. మిగిలిన గుంతల మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేయడానికి వేగవంతంగా చర్యలు కొనసాగుతున్నాయి.
జిల్లా అభివృద్ధి మరియు ప్రధాన కార్యక్రమాలపై సమగ్ర సమీక్ష సమావేశం
కాకినాడ కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాలులో జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు సమీక్ష సమావేశం నిర్వహించి, జిల్లా అభివృద్దికి జరుగుతున్న కార్యక్రమాలతో పాటు,ఖరీఫ్ లో ధాన్యం సేకరణ, పట్టణాభివృద్ది, మెప్మా, కాకినాడ స్మార్ట్ సిటీ కార్పొరేషన్, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పధకం, త్రాగునీటి సరఫరా, రోడ్లు, భవనాలు, ఇరిగేషన్ అంశాలపై ప్రజాప్రతినిధులు చర్చించారు.
కాకినాడ జిల్లా ఇన్చార్జిగా మంత్రి నారాయణ గారి మొదటి పర్యటన
జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మంత్రి నారాయణ తొలిసారిగా కాకినాడలో నవంబర్ 5న పర్యటించి టీడీపీ జిల్లా కార్యాలయానికి రాగానే కూటమి పార్టీల నాయకులు ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు చిన రాజప్ప,ఎమ్మెల్యేలు పంతం నానాజీ,వరుపుల సత్య ప్రభ,మాజీ శాసన సభ్యులు SVSN వర్మ, ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్,పార్టీ ఇన్చార్జి లు,ముఖ్య నేతలు పాల్గోన్నారు. తరువాత అయన టీడీపీ, జనసేన,బీజేపీ ముఖ్య నేతలతో సమావేశమైయారు. జిల్లాలో పార్టీల పరిస్థితి,కూటమి పార్టీ […]
బుడమేరు వరద సహాయ చర్యల్లో మంత్రి నారాయణ గారి కీలక నాయకత్వం
ఏపీ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టి విశేష కృషి చేసారు . రాత్రి సమయంలోనూ ఆయన వరద సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఖండ్రిక సమీపంలో నున్న – నూజివీడు రహదారి చుట్టుపక్కల వరద నీటిని తొలగించేందుకు ఉన్న అన్ని మార్గాలపై అధికారులతో చర్చలు జరిపారు. మరోవైపు వరద బాధితుల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది,వరద బాధితులకు నిత్యావసరాల సరుకులను ,లక్షల కొద్దీ […]
మంత్రి నారాయణ గారి దిశానిర్దేశంలో రాజధాని అభివృద్ధికి ₹11,000 కోట్ల విడుదలకు హడ్కో ఆమోదం
ముంబైలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో అమరావతి రాజధాని నిర్మాణానికి ₹11,000 కోట్ల రుణాన్ని మంజూరు చేయడానికి హడ్కో ఆమోదం తెలిపిందని మంత్రి నారాయణ గారు ప్రకటించారు. ఈ సందర్భంగా నారాయణ గారు మాట్లాడుతూ, రాజధాని అభివృద్ధిని వేగవంతం చేయడానికి హడ్కోతో మంతనాలు నిర్వహించామని, ఈ నిధుల విడుదలతో నిర్మాణ పనులు మరింత ముందుకు సాగనున్నాయని వివరించారు. హడ్కో నిర్ణయం అమరావతి నిర్మాణంలో కీలక మలుపుగా మారుతుందని నారాయణ గారు తెలిపారు. ఈ ఆర్థిక మద్దతుతో రాజధాని […]
కానూరులో సిద్ధార్థ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన మంత్రి నారాయణ గారు
కానూరులో సిద్ధార్థ ఫ్లై ఓవర్ ను స్వయంగా ప్రారంభించడం పట్ల మంత్రి నారాయణ గారు సంతోషం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలోని ఆర్థిక అవ్యవస్థ, మున్సిపాలిటీల పన్నుల నిధుల దుర్వినియోగంపై విమర్శించి, 2019, 2020లో అమృత్, స్వచ్ఛ భారత్ పథకాల కింద కేంద్ర నిధులు విడుదల అయ్యుంటే డ్రైనేజీ, తాగునీటి సమస్యలు పరిష్కారమయ్యేవన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే కృషి చేస్తున్నారని, అలాగే తాడిగడప మున్సిపాలిటీలో దారుణ స్థితిలో ఉన్న అన్ని […]
జీవనోపాధుల జాతర : మంత్రి నారాయణ గారి అభిప్రాయాలు
మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన జీవనోపాధుల జాతర వర్క్ షాప్ కార్యక్రమంలో మంత్రి నారాయణ గారు పాల్గొని, ఏ పని మీదైనా ఏకాగ్రతతో వంద శాతం దృష్టి పెడితే కచ్చితంగా సాదించవచ్చని, చేసే పనిలో డైవర్షన్ లేకుండా చేస్తేనే క్వాలిటీ వస్తుందని, సభ్యులను ఉద్దేశించి కార్యక్రమంలో సూచనలు చేసారు.రాష్ట్రంలో ప్రతీ ఒక్కరి తలసరి ఆదాయం రెట్టింపు అయ్యి, ప్రతీ కుటుంబంలో ఒక వ్యాపారవేత్త తయారు చేసి లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారని, దానికి అనుగుణంగా […]
మంత్రి నారాయణ గారి చొరవతో భూములిచ్చేందుకు ముందుకొస్తున్న రైతులు
రాజధాని నిర్మాణానికి భూములిచ్చేందుకు ముందుకొచ్చిన రైతుల ఇంటికి స్వయంగా మంత్రి నారాయణ గారు వెళ్లి స్వీకరించారు. ఎర్రబాలెంలో 11 మంది రైతుల నుంచి 12.27 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా స్వీకరించి,ఎవరైనా భూములు ఇవ్వాలనుకుంటే వారి ఇళ్లకే వెళ్లి తీసుకుంటామన్నారు. గతంలో రాజధానికి భూములు ఇవ్వని రైతులు నేడు స్వచ్ఛందంగా భూములు ఇవ్వడానికి సిద్ధపడ్డారని అన్నారు.రైతుల అనుమానాలు నివృత్తి చేసేందుకు సెంటు భూమి ఇచ్చిన వారి ఇంటికి కూడా నేరుగా వెళ్లి తీసుకుంటామని, భూములివ్వడానికి ముందుకు వచ్చిన […]
దగదర్తి విమానాశ్రయ ఏర్పాటుకు మంత్రి నారాయణ గారి కృషి
2019 జనవరిలో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు దగదర్తి దగ్గర విమానాశ్రయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దగదర్తిలో కాకుండా.. ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సరిహద్దులోని తెట్టు అనే ప్రాంతంలో 2వేల ఎకరాల్లో విమానాశ్రయాన్ని నిర్మించాలని నిర్ణయించింది. అయితే, ప్రాజెక్ట్‌కు నిధులు సమకూర్చడానికి రుణదాతలను పొందలేకపోవడం మరియు ప్రభుత్వం మారడం వంటి వివిధ కారణాల వల్ల ఈ ఒప్పందం జూలై 2020లో రద్దు చేయబడింది. మళ్ళీ ఇప్పుడు […]
మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో నెల్లూరులో రెవెన్యూ సమావేశం
నెల్లూరు నగరంలోని ఎసి నగర్లో జరిగిన రెవిన్యూ సదస్సులో మంత్రి నారాయణ గారు పాల్గొని, గత వైసిపీ ప్రభుత్వంలో ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ కబ్జాలకు పాల్పడ్డారని, సెంటు భూమి నుండి ఎకరాల్లో వైసిపీ ప్రభుత్వంలో కబ్జా జరిగిందని పేర్కొన్నారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా ప్రజల ఆస్తిని కాపాడేందుకే ల్యాండ్ గ్రాబింగ్ ప్రైవేన్షియల్ బిల్ ప్రవేశపెట్టామని, ప్రవైట్ వ్యక్తి ఆస్థి లాక్కున్నా, ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన నాన్ బెయిల్ క్రింద 10 […]