- నెల్లూరులో సెంచరీ కొట్టిన నారాయణ నేత్ర జ్యోతి & దంత సురక్ష
- ఇంటింటికీ ఉచిత వైద్యం..100వ రోజు ఘనంగా నారాయణ ఆన్ వీల్స్ సంబరాలు
- పేదల ఆరోగ్యం కోసం సొంత నిధులతో మంత్రి నారాయణ మహాయజ్ఞం
- నారాయణ ఆన్ వీల్స్ 100 డేస్..నెల్లూరులో వైభవంగా ఉచిత వైద్య శిబిరం
రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సొంత నిధులు 3 కోట్లతో ప్రారంభించిన నారాయణ ఆన్ వీల్స్ ఉచిత వైద్య శిబిరాలు విజయవంతంగా 100వ రోజుకు చేరుకున్నాయి. నెల్లూరు నగరం 54వ డివిజన్ జనార్దన్ రెడ్డి కాలనీలో నాయకులు, వైద్యాధికారులు కేక్ కట్ చేసి ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు నారాయణ నేత్ర జ్యోతి కింద 11,000 మందికి ఉచిత కంటి పరీక్షలు చేసి, 6,500 మందికి పైగా కళ్లద్దాలు, 200 మందికి ఉచిత శస్త్రచికిత్సలు అందించగా..దంత సురక్ష ద్వారా 6,500 మందికి దంత పరీక్షలు, 2,500 మందికి ఉచిత చికిత్సలు అందించారు. దీనికి తోడు ప్రతి శనివారం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు ఇటీవల 10,000 మంది పేద విద్యార్థులకు ఉచిత సైకిళ్లు పంపిణీ చేశారు,కోట్ల వ్యయంతో 15 మున్సిపల్ హైస్కూళ్లను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నారు. నేరుగా పేదల ఇళ్ల వద్దకే వచ్చి సేవలు అందిస్తుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు




